Sunday, July 20, 2025
Homeజిల్లాలుప్రకాశంమెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను జయప్రదం చేయండి

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను జయప్రదం చేయండి

_ మండల విద్యాశాఖ అధికారులు సంజీవి శ్రీనివాసులు

విశాలాంధ్ర పీసీపల్లి : పీసీపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలలో ఈనెల 10వ తేదీన జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగును జయప్రదం చేయాలని మండల విద్యాశాఖ అధికారులు సంజీవి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టిందని అందులోభాగంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్- టీచర్ మీట్ నిర్వహించినట్లు తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు సంబందిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు