Sunday, July 20, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఘనంగా మందకృష్ణ జన్మదిన వేడుకలు

ఘనంగా మందకృష్ణ జన్మదిన వేడుకలు


చిరంజీవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు…
అండగా నిలుస్తున్న చిరంజీవి……
సమస్య ఏదైనా సరే చిరంజీవి వెన్నంటే ఉంటే చాలు………

(విశాలాంధ్ర ) వత్సవాయి : బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోస్తున్న మంద కృష్ణ మాదిగ చరిత్రలో ఒక ధ్రువతారగా మిగిలిపోతారని తెలుగుదేశం యువ నాయకులు దారెల్లి.చిరంజీవి అన్నారు. మందకృష్ణ మాదిగ జన్మదిన పుష్కరించుకొని వత్సవాయి మండలం పోచవరం గ్రామంలో మందకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల కోరుక మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల చిరంజీవి అసోసియేషన్ అధ్యక్షులు పోలంపల్లి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు. దారెల్లి చిరంజీవి హాజరై కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా పేద బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి మందకృష్ణ మాదిగ అని, అటువంటి పోరాట ప్రతిభ కలిగిన నాయకుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం అన్నారు. ఎటువంటి పదవి లేకుండా ఏళ్ల తరబడి పేదల పక్షాన నిలబడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటువంటి నాయకుడు భవిష్యత్తులో ఉన్నత తప్పకుండా కనిపిస్తారు అన్నారు.ఈ కార్యక్రమంలో కంభంపాటి నాని దారెల్లి రవి. మరియు పోచవరం గ్రామస్తులు రవి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు