విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో, టీడీపీ సీనియర్ నాయకులు అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుబ్బలవారి పాలెం గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైయస్సార్సీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సానబోయిన విఘ్నేశ్వరరావు, సానబోయిన రామకృష్ణ, సానబోయిన వెంకటేశ్వర్లు, సానబోయిన అబ్బులు, సానబోయిన సత్తిబాబు, సానబోయిన కొండ, సానబోయిన సూర్యచక్ర గోవిందు, కొప్పిశెట్టి చిన వెంకన్న, గుత్తుల రమణ, చీకట్ల వీరన్న, పిల్లి చిన్న, కొప్పిశెట్టి శ్రీను, కొప్పిశెట్టి సూరిబాబు, గుత్తుల గోవిందు, కడియాల సుబ్బారావు, గుబ్బల శ్రీను, గుబ్బల రాంబాబు, సుంకర సతీష్, అన్నందేవుల వెంకటేశ్వరరావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గోరంట్ల, స్థానిక నాయకులు అన్నందేవుల చంటి వీరికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాధవరాయుడు పాలెంలో టీడీపీలోకి భారీ చేరికలు
- Advertisement -
RELATED ARTICLES


