Thursday, January 15, 2026
Homeజిల్లాలువిజయనగరంనందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు

నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (, విజయనగరం జిల్లా): రాజాం మండలం నందబలగ గ్రామంలో ప్రతి నెలా నాలుగవ గురువారం నిర్వహించే సందర్శన వైద్య శిబిరాన్ని ఈ నెల కూడా విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిద్దేశ్వరి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్యాంప్‌లో ప్రజలకు అనేక వైద్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేశారు. ఈ శిబిరంలో అందించిన వైద్య సేవల వివరాలు:ఓపి పేషెంట్లు: 75,గర్భిణీల ఆరోగ్య పరీక్షలు: 04,చిన్నారుల పరీక్షలు: 03,కుష్టు (లెప్రసీ) అనుమానితుల తనిఖీలు: 04,గ్రామ ప్రజలకు ప్రాథమిక నుండి అవసరమైన వైద్య సలహాలు, ఫాలోఅప్ సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ క్యాంప్ నిర్వహణలో సోపేరు ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, హెచ్ఏ, ఆశా వర్కర్లు, 104 సిబ్బంది, డిఈఓ తదితరులు పాల్గొని సేవలందించారు. గ్రామ ప్రజలకు సులభంగా, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు