Homeజిల్లాలుఅనంతపురంమండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం

మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం

- Advertisement -

-గంగులకుంటలో రూ.1.20కోట్లతో సీసీ రోడ్డుకు భూమి పూజ
-ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గం రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి నుండి గంగులకుంట గ్రామం వరకు రూ. 1 కోటి 20 లక్షల వి.బి.జి.రామ్.జి నిధులతో నిర్మించనున్న సి.సి. రోడ్డు నిర్మాణానికి ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, పీఆర్ డీఈ లక్ష్మీనారాయణ, జేఈ కిషోర్, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, గంగలకుంట రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట సుధాకర్ వైస్ చైర్మన్ కిష్ట తదితరులతో కలిసి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గంగులకుంట గ్రామం టీడీపీకి కంచుకోట అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చామన్నారు. ఒక్క రాప్తాడు మండలానికి ‘పల్లె పండుగ’ కింద రూ. 5.46 కోట్లతో పనులు మంజూరుకాగా. పండమేరు బ్రిడ్జి రూ.4.90 కోట్లతో, ప్రసన్నాయపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లతో పనులు జరుగుతున్నాయని, మరో రూ. 4 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే పార్కు కోసం రూ. 1.65 కోట్లు, పండమేరు వెంకటరమణస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.68 కోట్లు కేటాయించామన్నారు.
ఈ ఏడాది నీటి సమస్య ఉన్న కారణంగా గంగలకుంట చెరువుకు నీరు ఇవ్వలేకపోయామని..వచ్చే ఏడాది గొందిరెడ్డిపల్లి నుండి చెరువుకు సాగునీరు కచ్చితంగా అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై వైసీపీ నానాయకులు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని వాటిని పట్టించుకోవద్దన్నారు. గత ఐదేళ్లలో వాళ్లు జానెడు రోడ్డు కూడా వేయలేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సాగునీరు, తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఇళ్లు, ఇంటి పట్టాలు లేని వారు అర్జీలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గోపాల్, సాకే నారాయణ స్వామి, గజ్జల నారాయణస్వామి, బోయ వెంకటరాముడు, బీరన్న, మాజీ సర్పంచ్ సాకే తిరుపాల్, డీలర్ గంగాధర్, రాజలింగం, గేట్ సత్తి , ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, కురుబ శివ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు