Sunday, July 20, 2025
Homeఆంధ్రప్రదేశ్సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ4 గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ నుంచి మినహాయింపు కోసం, ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఎంపీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. శుక్రవారం మరోమారు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఎంపీ విచారణ సందర్భంగా సిట్‌ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు