విశాలాంధ్ర ధర్మవరం : అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపికల్లో ధర్మవరం పట్టణానికి చెందిన ముత్యాల చైత్ర ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.ముత్యాల చైత్ర తండ్రి ఎం. రాజేంద్రప్రసాద్ ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న చైత్రకు మెరుగైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో కుటుంబం రెండేళ్ల క్రితం ధర్మవరం నుంచి అనంతపురానికి మారింది.అనంతపురంలోని ఆర్డీటీ ఏడీసీఏ క్యాంపులో క్రికెట్ కోచ్‌లు జోషి కుమార్, యుగేందర్ రెడ్డి వద్ద చైత్ర శిక్షణ పొందుతోంది. గత రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ ఆటలో ప్రతిభను మెరుగుపరుచుకుంది.ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 జిల్లా క్రికెట్ జట్టు ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన చైత్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. చైత్ర రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షిస్తూ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కమిషనర్ ఆశీస్సులు అందజేశారు. క్రీడాకారిణి ముత్యాల చైత్రకు కుటుంబ సభ్యులు, కోచ్‌లు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.
అండర్-17 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన చైత్రకు మున్సిపల్ కమిషనర్ అభినందనలు
- Advertisement -
RELATED ARTICLES


