విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కే నాగేంద్ర అక్టోబర్ 28వ తేదీ విధులు నిర్వర్తిస్తున్న అతనిపై గుర్తుతెలియని ద్విచక్ర వాహనము గండికోట హాస్పిటల్ ముందు బాగాన (ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు) డి కొట్టి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని శానిటరీ విభాగమునకు, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కానీ 29వ తేదీ, 30వ తేదీ ఉదయం వరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందుకున్నారు. కానీ 30వ తేదీ ఉదయమే మృతి చెందడం జరిగింది. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారంను అందించి ఫిర్యాదు చేశారు వారి కుటుంబ సభ్యులు. తదుపరి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తికి భార్యనిర్మలమ్మతోపాటు 16 సంవత్సరాల నాగచైతన్య, 22 సంవత్సరాల తేజస్విని కలరు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు నాగేంద్ర మృతికి సంతాపం.. ఆర్థిక సహాయం అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు విధి నిర్వహణలో ఉంటూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు కేశగాళ్ల నాగేంద్ర మృతి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తెలిపారు.
విధి నిర్వహణలో ఉంటూ తుదిశ్వాస విడిచిన మున్సిపల్ పారిశుద్ధ్యవిభాగంలోని ఆప్కాస్ కార్మికుడు కేశగాళ్ల నాగేంద్ర, మృతి చెందడం బాధాకరమన్నారు. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని వెళ్లడం, తదుపరి రోజు మరణించడం చాలా బాధాకరమని తెలిపారు.
మృతుడికి మట్టి మట్టిఖర్చులకు గాను ప్రభుత్వం ద్వారా 20వేల రూపాయలను పంపిణీ చేశామన్నారు. ఈ నగదును సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మేకల బాబు, బి,నాగరాజు, కోశాధికారి ఎం,నాగభూషణ, ముత్యాలు నాగేంద్ర కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు


