Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మధ్యాహ్న భోజన పథకం తనిఖీ

విశాలాంధ్ర – చాగలమర్రి : మండలంలోని ముత్యాలపాడు తాండా గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో మహబూబ్ దౌలా,ఎంఈఓ న్యాంతుల్లా లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి.పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అందించే బోజనం మెనూ ప్రకారం నాణ్యమైనది అందించాలని సూచించారు.అనంతరం నాడు – నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమం లో పిఆర్‌ ఏఈ కొండారెడ్డి, హెచ్‌ఎం హుసేన్‌పీరా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img