విశాలాంధ్ర – చాగలమర్రి : మండలం లోని శెట్టివీడు గ్రామం లో కొత్త పింఛన్లు బుధవారం పంపిణీ చేసారు.గ్రామం లోని సచివాలయం వద్ద గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి,వైసిపి నాయకురాలు రాధికలు పంపీణీ చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల,మతాలకు,పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు.కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ జమాల్ వలి,చిన్స భికారి,వెల్పేర్ సహాయకులు సుధాకర్,కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.