Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

వడ్డెమానులో ప్రశాంతంగా స్కూల్ చైర్మన్ ఎన్నికలు

– విద్యా కమిటీ చైర్మన్ గా మహమ్మద్ హుస్సేన్
– వైస్ చైర్మన్ గా బోరెల్లి ఆశీర్వాదమ్మ
– భోజనం పథకాన్ని పరిశీలించిన కమిటీ బృందం
– సమావేశంలో సమస్యలపై ప్రస్తావన

నందికొట్కూర్( నంద్యాల) -: మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్, వైస్ చైర్మన్ గా బోరెల్లి ఆశీర్వాదమ్మలను 24 మంది కమిటీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీ మెంబర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ లు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని చేతులెత్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల కమిటీ సమావేశంలో విద్యార్థినీలకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని స్కావెంజర్ క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, చైర్మన్ ,వైస్ చైర్మన్ దృష్టికి కమిటీ మెంబర్లు తీసుకొచ్చారు. పాఠశాలకు నాడు నేడు కింద నిధులు ఎంత మంజూరయ్యాయని వారిని ప్రశ్నించారు. పాఠశాల మైదానంలో చెట్లు పెరిగే అపరిశుభ్రంగా ఉన్నాయని పాములు ,తేళ్లు వస్తున్నాయని మైదానంలో గడ్డి మందు ద్వారా పిచ్చికారి చేయాలని సూచించారు. పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నెలకొకసారి ఏర్పాటు చేయాలని పాఠశాల కన్వీనర్ జుబేదా బేగం, కో కన్వీనర్ రఫిక్ అహ్మద్ కమిటీ మెంబర్లు కోరారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో. అన్నం ,సాంబారు, గుడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ,విద్యార్థులతో మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా అంటూ కమిటీ మెంబర్లు ఆరా తీశారు. నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ,కమిటీ మెంబర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్ఐ రఘురామయ్య, పోలీస్ సిబ్బంది సుభాష్ రెడ్డి ,రాజశేఖర్ నాయక్ , హోంగార్డ్ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీస్ బందబోస్తు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు నాగ సుశీలమ్మ , శివమ్మ ఉపాధ్యాయులు, శివకోటిరెడ్డి, ప్రసాదరావు ,అల్లి హుస్సేన్, హబీబుల్లా, ఈశ్వరయ్య, నౌమాను హుస్సేన్ ,పాఠశాల క్లర్క్ సింధూర ,లైబ్రేరియన్ రామ్మోహన్, కమిటీ మెంబర్లు ఎన్. స్వాములు, ప్రమీల, శివకుమారి ,శాలిబి , మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img