దేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరు మృతి
సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు
విశాలాంధ్ర -మిడుతూరు: కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి మార్గమధ్యంలోని గార్గేయపురం గ్రామంలోని మరియ నిలయం పాఠశాల దగ్గర గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని మిడుతూరు మండల పరిధిలో గల దేవనూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం పై కర్నూలుకు వెళుతున్న తరుణంలో అటువైపుగా వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.