విశాలాంధ్ర -మిడుతూరు: మండల పరిధిలోని దేవనూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి వారి ఆధ్వర్యంలో జి. ధనలక్ష్మి అధ్యక్షతన , కేంద్రీయ ప్రత్తి పరిశోధన స్థానం, నాగపూర్ వారి అధిక సాంద్ర పద్దతిలో ప్రత్తి సాగు ప్రాజెక్ట్ పై అవగాహన రైతులకు కల్పించారు. రైతుల పొలల్లో ఆ విధానంలొ స్వల్ప కాలిక రకమైన రాసి స్విఫ్ట్ ప్రత్తి విత్తనాలు నాటించడం జరిగినట్లు తెలిపారు. ఇందులో సాలుకు మధ్య దూరం 90 సే. మీ. మరియు మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సే. మీ. గా విత్తించారు. వీరు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధిక సాంద్ర పద్దతే అధిక లాభాలు ఇస్తుందని, ఇందులో కనీసం ఎకరాకు ఎనిమిది నుండి పన్నెండు క్వింటాల దిగుబడి పొందగలమని తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. అలాగే కేవలం 150 రోజుల్లో పంట ఒకేసారి పక్వానికి వచ్చి, పురుగు ఉధృతిని తప్పించెకోవడమే గాక, ఒకేసారి నాణ్యమైన ప్రత్తి తీయగలమణి సూచించారు.
శాస్త్రవేత్త రమణయ్య మాట్లాడుతూ మొదటి 60 రోజుల్లో చెప్పట్టాల్సిన ఎరువుల యాజమాన్యం పై వివరించారు. పైపాటుగా ఎరువుల పిచికారీ వల్ల త్వరగా మొక్క వినియోగించు కుంటుందని తెలిపారు. అలాగే శాస్త్రవెత్త బాలరాజు గులాబీరంగు, రసం పీల్చే పురుగులు మరియు పత్తిని ఆశించే తెగుళ్ల నివారణ కు చెప్పట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలు వివరించారు.
ఈ కార్యక్రమంలొ నందికొట్కూరు ఎ. డి. ఎ విజయ్ శేఖర్, పాల్గొని కేవీకే సేవలను అందిపుచ్చుకొని అధిక ఆదాయం పొందాలని సూచించారు. అనంతరం పశుగ్రాస విత్తనాలు, సూక్ష్మ పోషకాలు మరియు పిరమోన్ ట్రాప్స్ రైతులకు అందచేశారు.
ఏరువాక కేంద్రం, సైంటిస్ట్ రామకృష్ణ రావు,
కేవీకే శాస్త్రవేత్తలు క్రిష్ణ మూర్తి, రవిగౌడ్, వ్యవసాయ అధికారి పీరు నాయక్, వి ఎ ఎ దేవకుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.