: పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం
: మిడుతూరు ఎంపీడీవోగా జి.నాగశేషాచల రెడ్డి
విశాలాంధ్ర,( నంద్యాల )మిడుతూరు -: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిడుతూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా జి.నాగశేషాచల రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా పనిచేస్తున్న జీ. గంగావతి బదిలీలో భాగంగా అనంతపురం జిల్లాకు వెళ్లారు .సాధారణ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా మిడ్తూరు నుండి శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలమునకు బదిలీపై వెళ్లడం జరిగింది . అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి మిడుతూరు ఎంపీడీవో గా విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని , గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల రోగాల బారిన పడకుండా పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.