Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అక్కాచెల్లెళ్లపై రేప్‌, మర్డర్‌ ..ఆరుగురు అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో దారుణం వెలుగుచూసింది. పెళ్లికి నిరాకరించారన్న కోపంతో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లపై కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 17 ఏళ్లు, 15 ఏళ్ల ఆ అమ్మాయిల్ని ఓ చెట్టుకు వేలాడదీశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు జునైద్‌, సొహైల్‌, హఫీజుర్‌, రెహమాన్‌, కరీముద్దీన్‌, ఆరీఫ్‌, చోటులను అరెస్ట్‌ చేశామని అన్నారు. బుధవారం లఖింపూర్‌లో ఇద్దరు బాలికల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గ్రామస్తులు నిరసనకు దిగారు. దర్యాప్తు చేపట్టేందుకు వెళ్లిన పోలీస్‌ అధికారులను అడ్డకున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల ప్రకారం.. కొంతకాలంగా జునైద్‌, సొహైల్‌లు ఆ బాలికలను ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు. బుధవారం బాలికలను ఇద్దరిని బైక్‌పై ఎక్కించుకుని కిలో మీటరు దూరంలోని పొలాల్లోకి తీసుకువెళ్లారు. పెళ్లి చేసుకోవాలని కోరగా వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన జునైద్‌, ఆరిఫ్‌లు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చెట్టుకి వేలాడతీశారు. మరో నలుగురు యువకులు వారికి సహకరించారు. ఆ ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీస్‌ చీఫ్‌ సంజీవ్‌ సుమన్‌ తెలిపారు. పక్క గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బాలికలను అపహరించి, అత్యాచారం చేసి హత్య చేశారని బాలికల తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యోగి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు అధికమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిఘాసన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు దళిత సోదరీమణులను కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. యోగి హయాంలో లఖింపూర్‌లో రైతుల హత్య, హత్రాస్‌ కుమార్తె హత్య,. ఇప్పుడు దళిత బాలికల హత్యలు ఇలా పునరావృతమవుతూనే ఉన్నాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. లఖింపూర్‌లో జరిగిన హృదయ విదారక ఘటనతో నేరస్తులకు యుపి అడ్డాగా మారిందన్న వాస్తవానికి నిదర్శమని బిఎస్‌పి అధినేత మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు తగ్గేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు యోగి ప్రభుత్వం కృషి చేస్తుందన్న వాదనలు తప్పు అని ఈ ఘటన బహిర్గతం చేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయంటూ టివి, వార్తాపత్రికల్లో తప్పుడు ప్రకటనలతో యోగి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. శాంతి భద్రతలు మెరుగైతే మహిళలపై ఇలాంటి క్రూరమైన నేరాలు ఎందుకు పెరుగుతున్నాయని.. ఈ ప్రభుత్వం ఎప్పుడు మేల్కోంటుందని మండి పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img