Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

అఖిలేశ్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు

2022 యూపీ ఎన్నికలు ప్రభంజనం సృష్టిస్తాయి
లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే దశాబ్దపు దేశ చరిత్రను తిరిగిరాస్తాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ప్రతికూల రాజకీయాలను ఓడిరచాలని ఆయన కోరారు. మణిపురి జిల్లాలోని కర్‌హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. తను అనుకూల రాజకీయాలతో, ప్రగతిశీలన ఆలోచనతో పరిపాలన చేపడతానని ఆయన తెలిపారు. కర్‌హాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్‌ను రంగంలోకి దింపింది. ‘నామినేషన్‌ అనేది ఓ మిషన్‌. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు రాబోయే దశాబ్దపు దేశ చరిత్రను తిరిగి రాస్తాయి. ఈ మిషన్‌లో పాల్గొని అనుకూల రాజకీయాలతో, ప్రగతిశీల ఆలోచనల్లో భాగం పంచుకుని, ప్రతికూల రాజకీయాలను సమూలంగా తొలగించాలి… జైహింద్‌’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img