Friday, August 19, 2022
Friday, August 19, 2022

అగ్నిపథ్‌పై నేడు భారత్‌ బంద్‌.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు

రైల్వేస్‌ హైఅలర్ట్‌…
పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలు నిరసన బృందాలు నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా, రaార్ఖండ్‌, పంజాబ్‌, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి.ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్‌ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రaార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అగ్నిపథ్‌ పథకం వ్యతిరేక నిరసనల్లో దాదాపు 12 రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేసిన నేపథ్యంలో నేటి భారత్‌ బంద్‌ పిలుపును భద్రతా బలగాలు సవాలుగా తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వేల్లో హైఅలర్ట్‌ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెక్షన్‌ 144 అమలులో ఉంది. నిరసనకారులు చొరబడకుండా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు.అగ్నిపథ్‌ పై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నా.. ఆ పథకాన్ని రద్దు చేయబోమని కేంద్రం, త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ లో ఇకపై సాధారణ నియామకాలు ఏవీ ఉండబోవని, అగ్నిపథ్‌ పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీలు చేస్తామని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుండబద్దలు కొట్టారు. త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. కాగా, అగ్నిపథ్‌ పథకాన్ని సమర్థించుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img