Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

అదానీ ప్రాజెక్ట్‌పై మత్స్యకారుల ఆగ్రహం.. ..పెద్దఎత్తున నిరసన

కేరళలోని తిరువనంతపురంలోని విజింజం మత్స్యకారులు నిరసనతో హోరెత్తుతుంది.అదానీ పోర్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా మత్స్యకారులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. భారీ సంఖ్యలో మత్స్యకారులు నల్లజెండాలతో ఓడరేవు ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నారు. దాంతో పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అదానీ ప్రాజెక్ట్‌ వల్ల మత్స్యకారులు నిరాశ్రయులవుతున్నారని, దానికి శాశ్వత పరిష్కారం కావాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభం కాగానే వందల ఎకరాల తీరప్రాంతం నాశనమైందని వారు ఆరోపించారు.
విజింజంలో అధాని నిర్మించిన ఓడరేవులో అశాస్త్రీయమై నిర్మాణాలే సముద్ర తీర కోతకు కారణమని నిరసనకారులు అంటున్నారు. కాగా గత వారం రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తోందని వందలాదిమంది మత్స్యకారులు రాష్ట్ర రాజధానిలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. పడవలు, చేపల వలలతో సచివాలయాన్ని ముట్టడిరచారు. కాగా తిరువనంతపురంలోని విజింజం తీరప్రాంతంలో రూ.7,525 కోట్లతో పోర్టు నిర్మాణానికి 2015లో అప్పటి యూడీఎఫ్‌ ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అనుమతులు మంజూరు చేసింది. అందులో భాగంగా తొలిదఫా నిర్మాణం పూర్తైంది. అప్పటి నుంచి మత్స్యకారులు ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పోర్టు నిర్మాణంతో సముద్రాన్నే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని ఆది నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. దాంతో చాలాసార్లు అదానీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img