Friday, August 19, 2022
Friday, August 19, 2022

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసులో అప్రూవర్‌గా సచిన్‌ వాజే

షరతులతో కూడిన మాఫీకి ప్రత్యేక సీబీఐ కోర్టు అంగీకారం
జ్యుడిషియల్‌ కస్టడీలోనే మాజీ పోలీసు అధికారి

న్యూదిల్లీ : మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసులో పోలీసు మాజీ అధికారి సచిన్‌ వాజే అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం మన్నించింది. ఇకపై కేసులో ప్రాసిక్యూషన్‌ విట్‌నెస్‌గా ఆయన ఉంటారు. తన అరెస్టుకు ముందు, తర్వాత కూడా సీబీఐకు పూర్తిగా సహకరించినట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో వాజే పేర్కొన్నారు. ఆయన వాంగ్మూలం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) నిబంధనల ప్రకారం మెజిస్ట్రేట్‌ ఎదుట నమోదు అయింది. వాజే ఫిర్యాదుకు కోర్టు అంగీకారం తెలిపింది. కొన్ని షరతులతో మాఫీకి అంగీకరించింది. ఇదే విషయన్ని ప్రత్యేక న్యాయమూర్తి డీపీ షింగ్డే బుధవారం వెల్లడిరచారు. మాజీ పోలీసు ఇప్పుడు ప్రాసిక్యూషన్‌ సాక్షిగా ఈ కేసులో వ్యవహరిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరం బీర్‌ సింగ్‌ గతేడాది మార్చిలో దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణల క్రమంలో సీబీఐ నమోదు అయింది. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని వాజేతో పాటు పోలీసు అధికారులకు దేశ్‌ముఖ్‌ సూచించినట్లు సింగ్‌ ఆరోపించారు. గత ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు ఉత్తర్వుల మేరకు దేశ్‌ముఖ్‌, వాజేతో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన అనంతరం రాష్ట్ర కేబినెట్‌ పదవికి ఎన్‌సీపీ నేత దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు. పోలీసు అధికారిగా వాజేపై వేటు పడిరది. ఆయనపై మరో మూడు కేసులు ఉన్నాయి. గతేడాది మార్చిలో ఎన్‌ఐఏ ఆయనను అరెస్టు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ముంబై నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఎస్‌యూవీ పార్కింగ్‌ వ్యవహారంలోÑ థానే వ్యాపారవేత్త మన్సుక్‌ హిరన్‌ హత్య కేసులో ఎన్‌ఐఏ ఈయనను విచారిస్తోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో అప్రూవర్‌గా ప్రకటించబడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా వాజే ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా దేశ్‌ముఖ్‌ కూడా ఉన్నారు. మనీలాండరింగ్‌ కేసులో అప్రూవర్‌గా మారుతానంటూ ఈడీకీ వాజే లేఖ రాయగా దానిని పక్కన పెట్టినట్లు లైవ్‌ లా ద్వారా తెలిసింది. షరతులతో కూడిన మాఫీ లభించినా ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలోనే కొనసాగనున్నారు. నేరం జరిగిన తీరు, అందుకు దారితీసిన పరిస్థితులతో పాటు పూర్తి నిజాన్ని వెల్లడిస్తారన్న షరతును వాజేకు ప్రత్యేక సీబీఐ కోర్టు పెట్టింది. అలాగే, మెజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోని వాస్తవాలనూ వెల్లడిరచాలనిÑ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేసే ప్రతి ప్రశ్నకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలని సూచించింది. ఇదే క్రమంలో ఓ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని వాజేకు కోర్టు స్పష్టంచేసింది. ఇంతకుముందు వాజే ఫిర్యాదుపై సీబీఐ స్పందించింది. కేసుకు సంబంధించిన అనేక అంశాలను స్వచ్ఛందంగానే దర్యాప్తు సమయంలో వాజే వెల్లడిరచినట్లు తెలిపింది. తన వాంగ్మూలంలో జరిగిన నేరాలను వివరించారని, దేశ్‌ముఖ్‌, ఆయన సిబ్బంది సంజీవ్‌ పలాండె, కుందన్‌ షిండెకు లంచాల వసూళ్లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమ ముడుపులతో ఉన్న సంబంధాలను వెల్లడిరచారని పేర్కొంది. ‘కేసులోని అనేక అంశాలతో వాంగ్మూలంలో వాజే చెప్పిన వివరాలకు పొంతన ఉంది. లంచాల వసూళ్లకు నిందితులు అనుసరించిన పద్ధతులు వాజేకు తెలుసు. నేరంలో ఇతరులు పాత్ర గురించీ ఆయనకు అవగాహన ఉంది’ అని ఏజెన్సీ పేర్కొంది. వాజే పూర్తి నిజాన్ని, నేర సంఘటనలను, ఇతరుల పాత్ర గురించి వాస్తవాలను వెల్లడిస్తానంటే అందుకు తగిన షరతులు విధిస్తూ ఆయన అప్రూవర్‌గా మార్చేందుకు కోర్టు అనుమతి ఇవ్వొచ్చు అని సీబీఐ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img