Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

అల్లోపతిని కించపరిచేలా వ్యాఖ్యలు.. రాందేవ్‌ బాబాపై మండిపడ్డ సీజేఐ

యోగా గురు రాందేవ్‌ బాబా తీరును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీవ్రంగా విమర్శించింది. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. యోగాను ప్రాచుర్యంలోకి తేవడం మంచిదే గానీ.. అల్లోపతి వైద్యులపై ఆయన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అని ప్రశ్నించింది. ఆయనను అనుసరించడం వల్ల అన్నీ నయమవుతాయని గ్యారంటీ ఏంటి? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నిలదీశారు. ఆల్లోపతి ఔషధాలు, వైద్యులు, కోవిడ్‌-19 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా రాందేవ్‌ బాబా చేస్తున్న ప్రచారం చేయడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘బాబా రామ్‌దేవ్‌ అల్లోపతి వైద్యులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు.. మంచిది. కానీ ఆయన ఇతర వ్యవస్థలను విమర్శించకూడదు.. ఆయనను అనుసరించడం వల్ల అన్నీ నయం అవుతాయని గ్యారంటీ ఏంటి?’’ అని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు, ఐఎంఏ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని రాందేవ్‌ బాబాను ఆదేశించింది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు డాక్టర్లకు ఆగ్రహం తెప్పించాయి. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న అనేకమంది డాక్టర్లు మృత్యువాత పడ్డారని, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానం అని రాందేవ్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img