న్యూదిల్లీ : మహిళా క్రీడాకారులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఈ మేరకు క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్, ఈ ఆరోపణలపై కమిటీ వేస్తానని హామీ ఇవ్వడంతో రెజ్లర్లు ఆందోళనను విరమించారు.
ఐఓఏ అధ్వర్యంలో కమిటీ
బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్టార్ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది.
వ్యక్తిగత అజెండాతోనే…
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందో ళనపై డబ్ల్యూఎఫ్ఐ శనివారం స్పందించింది. మహిళా క్రీడాకారులు చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను సమాఖ్య ఖండిర చింది. వ్యక్తిగత అజెండాతోనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖకు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ‘భారత రెజ్లింగ్ సమాఖ్యను తన విధి విధానాల ప్రకారం ఎన్నికైన పాలకవర్గం నిర్వ హిస్తుంది. ఇందులో అధ్యక్షుడితో సహా ఏ ఒక్కరూ ఏకపక్షంగా వ్యవహరించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు అవకాశమే లేదు. ప్రస్తుత అధ్యక్షుడి నాయక త్వంలో డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్ల ఉత్తమ ప్రయోజ నాల కోసమే పనిచేస్తోంది. జాతీయ, అంతరా ్జతీయ వేదికల్లో కుస్తీ క్రీడకు సమాఖ్య ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. పారదర్శకమైన, కఠిన మైన మేనేజ్మెంట్ వల్లే ఇది సాధ్యమైంది. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వారంతా వ్యక్తిగత అజెండా లేదా ఓ రహస్య అజెండాతోనే ఈ ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజ్మెంట్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఎవరైనా రెజ్లర్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఉండొచ్చు’ అని డబ్ల్యూఎఫ్ఐ క్రీడల శాఖకు వివరణ ఇచ్చింది.