Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఆకస్మిక వరదలపై సమీక్షిస్తున్నాం

ప్రధాని మోదీ
ఆకస్మిక వరదలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వర్‌, కార్గిల్‌లో ఆకస్మిక వరదలపై సమీక్షిస్తున్నామని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే కిష్ట్వర్‌లో పరిస్థితిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌, జమ్మూకశ్మీర్‌ డీజీపీతో మాట్లాడినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. గులాబ్‌గఢ్‌లో బుధవారం ఉదయం ఆకస్మిక వరదలతో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని, నాలుగుకు పైగా మృతదేహాలను వెలికి తీసినట్లు కిష్ట్వర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img