Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఆషా పరేఖ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

మాజీ నటి ఆషా పరేఖ్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. ఆషా పరేఖ్‌ వయసు 79 ఏళ్లు. శుక్రవారం జరిగే 68వ జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆషాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు ఆషా పరేఖ్‌ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ కమిటీలో ఆషా భోంస్లే, హేమా మాలిని, పూనమ్‌ దిల్లాన్‌, ఉదిత్‌ నారాయణ్‌, టీఎస్‌ నాగాభరణ ఉన్నారు. ఆషా పరేఖ్‌ 95 చిత్రాల్లో నటించారు. దిల్‌ దేకే దేకో, కటీ పతంగ్‌, తీస్రీ మంజిల్‌, బహారోంకే సప్నే, ప్యార్‌ కా మౌసమ్‌, కారవాన్‌ లాంటి హిట్‌ చిత్రాల్లో ఆమె నటించారు. 1952లో రిలీజైన ఆస్మాన్‌ చిత్రంలో ఆమె బాలనటిగా చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు బాప్‌ బేటి చిత్రంలో నటించింది. ఘోరా కాగజ్‌ టీవీ షోలో ఆమె పాత్రను పోషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img