Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఆస్కార్‌ ఎంట్రీ ‘ఛెల్లో షో’ మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి

సినిమా రిలీజ్‌ కాకముందే క్యాన్సర్‌ తో కన్నుమూశాడు బాలనటుడు రాహుల్‌ కోలి.దాంతో గుజరాత్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ‘ఛల్లో షో’ చిత్రంలో నటించిన బాలనటుడు రాహుల్‌ కోలి (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న రాహుల్‌.. అహ్మదాబాద్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 2న తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో భారత్‌ తరఫున ‘‘ఛెల్లో షో’’ ఎంపికైంది. భవిన్‌ రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌ రావల్‌, పరేష్‌ మెహతా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పాన్‌ నలిన్‌ దర్శకత్వం వహించారురాహుల్‌ నటించిన ‘ఛల్లో షో’ ఇటీవలె ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఈ చిత్రం అక్టోబర్‌ 14న విడుదల కానుంది. మూవీ రిలీజ్‌కు ముందే రాహుల్‌ మరణించడం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత తమ జీవితాలు మారుతాయని తమతో చెప్పేవాడని, ఆ రోజు రాకుండానే వెళ్లిపోయాడంటూ రాహుల్‌ తండ్రి రాము కోలి కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img