Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఆహార తయారీలో తగ్గిన ఎఫ్‌డీఐలు

న్యూదిల్లీ : ఆహారీ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2020-21లో 54 శాతం క్షీణించి రూ. 2,934.12 కోట్లకు చేరాయని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఆహాయ తయారీ రంగానికి సంబంధించి 2018-19 ఆర్థికసంవత్సరంలో రూ.4,430.44 కోట్లుగా ఎఫ్‌డీఐలు 2019-20లో రూ. 6,414.67 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,934.12 కోట్లుగా ఉన్నట్టు ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వకంగా సమాధానంలో పేర్కొన్నారు.
ఆహార తయారీలో ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోలు 2020-21లో 393.41 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని, అంతకు ముందు ఏడాది 904.70 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని మంత్రి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో %ఖూణ% 628.24 మిలియన్‌ డాలర్లు కాగా, 2017-18లో 904.9 మిలియన్లు, 2016-17లో 727.22 మిలియన్‌ డాలర్లని వివరించారు. ఈ రంగానికి ఆటోమేటిక్‌ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉందని పటేల్‌ తెలియజేశారు.‘ఆహార తయారీ రంగంలో ఎఫ్‌డీఐ వాటా మొత్తం ఎఫ్‌డీలలో 1.5 శాతం మాత్రమే.. ఈ రంగానికి దేశీయ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెండూ ఎక్కువగా అవసరం.. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని పటేల్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img