Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఇంట్లో పేలిన ఏసీ.. మంటలు అంటుకుని తల్లి, ఇద్దరు కుమార్తెల సజీవ దహనం

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఘటన
ఇంట్లోని ఏసీ పేలి మంటలు చెలరేగడంతో తల్లీకుమార్తెలు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శక్తినగర్ కేపీసీఎల్ కాలనీలోని సిద్ధలింగయ్య ఇంట్లో నిన్న మధ్యాహ్నం తల్లి, ఇద్దరు కుమార్తెలు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను రంజిత (33), మృదుల (13), తారుణ్య (05)గా గుర్తించారు. మంటలకు స్పష్టమైన కారణం తెలియరానప్పటికీ ఏసీలో పేలుడు వల్లే మంటలు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. శక్తినగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధలింగయ్య ఇంట్లో లేని సమయంలో ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img