Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఇకపై భారత్‌లోనూ గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌

భారత్‌లోనూ స్ట్రీట్‌ వ్యూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ అయితే…ఇంట్లోనే కూర్చుని ల్యాండ్‌మార్క్‌లను వర్చువల్‌గా చూడొచ్చు. రెస్టారెంట్‌లో కూర్చున్న అనుభూతినీ పొందొచ్చు. అంతేకాదు. స్పీడ్‌ లిమిట్స్‌ సహా రోడ్డు ఎక్కడ ఎండ్‌ అవుతుంది..? ట్రాఫిక్‌ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది తెలియజేసేలా ట్రాఫిక్‌ లైట్స్‌ లాంటి ఫీచర్లనూ జోడిరచనుంది. లోకల్‌ ట్రాఫిక్‌ అథారిటీస్‌ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయనుంది. డిజిటల్‌ కన్సల్టెన్సీలో టాప్‌లో ఉన్న టెక్‌ మహీంద్రాతో పాటు మ్యాపింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి భారత్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కొన్ని సిటీల్లో మాత్రమే ఈ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ పని చేయనుంది. బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. తరవాత హైదరాబాద్‌, కలకత్తాలోనూ అందుబాటులోకి వస్తుందని గూగుల్‌ సంస్థ వెల్లడిరచింది. క్రమంగా చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె, నాసిక్‌, వడోదర, అహ్మద్‌నగర్‌, అమృత్‌సర్‌లో ఈ సేవలు విస్తరించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img