Monday, August 8, 2022
Monday, August 8, 2022

ఇద్దరు అమ్మాయిల సహజీవనానికి గ్రీన్‌ సిగ్నల్‌.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుకున్న ఇద్దరు అమ్మాయిలకు.. కొన్నేళ్ల తర్వాత ఒకరంటే ఒకరిపై ఇష్టం ఏర్పడిరది. ఒకర్ను విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడటంతో తమది కేవలం స్నేహం మాత్రమే కాదని, అంతకు మించి అని భావించారు. ఇద్దరిదీ ప్రేమని వారికి అర్ధం కావడంతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఈ బంధాన్ని తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. అమ్మాయిలు ఇద్దర్నీ బలవంతంగా వేరుచేసి ఇళ్లకు తీసుకెళ్లడంతో విషయం కోర్టుకు చేరింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. వీరి బంధానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పడాన్ని తోసిపుచ్చిన హైకోర్టు.. ఇష్టపూర్వకంగా ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. మేజర్లు కలిసి జీవించడం నిషేధం కాదని జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆదిలా నస్రిన్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు పరిష్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img