Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఇద్దరు సలహాదారులకు సమన్లు పంపిన నవజ్యోత్‌ సిద్దు

కాశ్మీర్‌ అంశంపై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం, పైగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అభ్యంతకర కార్టూన్‌ షేర్‌ చేసిన తన ఇద్దరు సలహాదారులకు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు నోటీసులు జారీ చేశారు. వీరు తాజాగా కాశ్మీర్‌ ప్రత్యేక దేశం అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తుపాకీ పట్టుకున్న ఉన్న ఒక స్కెచ్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా, వీటిపై ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయమై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మల్వీందర్‌ సింగ్‌ మాలి, ప్యారేలాల్‌ గార్గి అనే ఈ ఇద్దరికీ సిద్దూ సమన్లు జారీ చేశారు. పాటియాలాలోని తన నివాసానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img