Monday, August 8, 2022
Monday, August 8, 2022

ఈశాన్యాన్ని ముంచెత్తుతున్న వానలు

గువహతి: వరుసగా నాలుగోరోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈశాన్య ప్రాంతంలో వరద పరిస్థితి భయంకరంగా ఉందని, ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. అసోం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం, రాష్ట్రంలోని 25 జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా 11 లక్షల మందికి పైగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని సోహ్రా (పూర్వపు చిరపుంజి)లో గడచిన 24 గంటల్లో 972 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1995 తర్వాత జూన్‌లో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలో ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురు ప్రయాణిస్తున్న పడవ జియా భోరోలి నదిలో బోల్తా పడిరది. ముగ్గురిని రక్షించామని, నాలుగో వ్యక్తి జాడ తెలియలేదని జిల్లా అధికారి తెలిపారు. గువహతిలోని పలు ప్రాంతాలు, డిమా-హసావో, గోల్‌పరా, హోజాయ్‌, కమ్రూప్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంవత్సరం అసోంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 46కు చేరింది. ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు పిల్లలు సజీవ సమాధి అయ్యారు. కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవులు, జలమార్గాలు, ఆయుష్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఫోన్‌ చేసి, రాష్ట్రంలో పరిస్థితిపై వాకబు చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని, బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు వివిధ శాఖలు రాత్రింబవళ్లు ఎలా పని చేస్తున్నాయని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. అసోంలో నిమతిఘాట్‌, ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర, నాగాన్‌ వద్ద కోపిలి, కమ్రూప్‌ వద్ద పుతిమరి, నల్బరి వద్ద పగలడియా, బర్పేట వద్ద మానస్‌, బెకి వంటి అనేక నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల కమిషన్‌ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. బొంగైగావ్‌, దిబ్రూగర్‌, గోల్‌పరా, కమ్రూప్‌, కోక్రారaర్‌, మోరిగావ్‌, నల్బరీ, సోనిత్‌పూర్‌ మరియు దక్షిణ సల్మారా వంటి జిల్లాల్లో భారీ స్థాయిలో రోడ్డు కోతకు గురయ్యాయి. ప్రస్తుత వరదల కారణంగా 68వేలమంది ప్రజలు 150 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. ప్రభుత్వ ఆహారం, మందుల పంపిణీ కోసం వివిధ ప్రాంతాల్లో 46 సహాయ కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటివరకు, 5,840 మందిని సురక్షితంగా తరలించినట్లు అసోం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా లక్షలాది జంతువులు కొట్టుకుపోగా, 0,142 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దిమా హసావోలో %చీజుజుూజూ% యొక్క జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ యొక్క నాలుగు స్లూయిస్‌ గేట్‌లు తెరవబడినందున కర్బీ ఆంగ్లోంగ్‌, మోరిగావ్‌ మరియు నాగావ్‌ జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఇదిలావుండగా, దిగువ అసోంలోని రంగియా డివిజన్‌లోని నల్బారి, ఘోగ్రాపర్‌ మధ్య రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో అనేక రైళ్లను దారి మళ్లించాయి. గురువారం రద్దు చేయబడిన ప్రముఖ రైళ్లలో న్యూ బొంగైగావ్‌-గౌహతి ప్యాసింజర్‌ రైలు, అలీపుర్‌దువార్‌-గౌహతి సిఫంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉన్నాయని రైల్వే ప్రతినిధి తెలిపారు. న్యూ ఢల్లీి-దిబ్రూగఢ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌, కామాఖ్య-ఢల్లీి బ్రహ్మపుత్ర మెయిల్‌, కామాఖ్య-లోకమాన్య తిలక్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, సీల్దా-అగర్తలా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img