Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఉద్యమంలో మరణించిన అన్నదాతలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది

రాహుల్‌ ట్వీట్‌
రైతులు తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించి, ఇళ్లకు వెళ్తున్న విషయంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ’’దేశం ఉన్నతమైంది. ఇక్కడనున్న వారంతా సత్యాగ్రాహి రైతులు. ఇలాంటి సమయంలో ఉద్యమం చేస్తూ మరణించిన అన్నదాతలను కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది’’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే పూర్తి విరమణ కాదని, తాత్కాలికంగానే విరమించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా నేత గురునామ్‌ సింగ్‌ చౌరానీ పేర్కొన్నారు. జనవరి 15న మరోసారి సమావేశమవుతామని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తమకు కొన్ని హామీలను ఇచ్చిందని, అందుకే తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img