Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఎందుకు ఓడాం

యూపీ నేతలతో ప్రియాంక సమీక్ష
న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నాయకులతో ప్రియాంకగాంధీ వాద్రా గురువారం చర్చించారు. ఓటమికి గల కారణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర నాయకులతో ఆమె వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ప్రజల విశ్వాసం పొందడంలో కాంగ్రెస్‌ ఎందుకు విఫలమైందో తెలపాలని ఆమె కోరారు. యూపీలోని మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేసింది. కేవలం రెండు సీట్లలోనే విజయం సాధించింది. 2.33 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. 97శాతం మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ప్రియాంకగాంధీ ప్రత్యేకించి మహిళా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తూ స్ఫూర్తివంతమైన ప్రచారం చేశారు. రాష్ట్ర నాయకులు ప్రమోద్‌ తివారీ, ఆచార్య ప్రమోద్‌ కృష్ణన్‌, సతీశ్‌ అజ్మానీ, అజయ్‌ రాయ్‌, అజయ్‌కుమార్‌ లల్లూ, వీరేందర్‌ చౌదరిలతో ప్రియాంక ముఖాముఖి చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఆమె మంతనాలు జరిపారు. ఓటమికి బాధ్యత తీసుకున్న ప్రియాంక…మంగళవారం నాయకులందరితో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల నాయకులతోనూ ప్రియాంక సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img