Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఎంపీ షఫీకుర్‌ బర్క్‌పై దేశద్రోహం కేసు

ఆప్ఘనిస్ధాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని సమర్ధించడంతో పాటు వారి దండయాత్రను భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చిన ఎస్పీ ఎంపీ షఫీకర్‌ బర్క్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. యూపీ పోలీసులు ఆయనపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత్‌ బ్రిటిష్‌ పాలనలో మగ్గినప్పుడు మన దేశం స్వాతంత్య్రం కోసం పోరాడిరదని, ఇప్పుడు తాలిబన్లు కూడా తమ దేశాన్ని స్వేచ్ఛగా తాము పరిపాలించుకోవాలని కోరుకుంటున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. ఆప్ఘన్‌ స్వాతంత్య్రం ఆ దేశ పౌరుల వ్యవహారమని, ఆప్ఘనిస్ధాన్‌ను అమెరికా ఎందుకు పరిపాలించాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాజేష్‌ సింఘాల్‌, ఓంవీర్‌ ఖద్‌వంశీల ఫిర్యాదుపై ఎస్పీ నేతపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా తాలిబన్లను తాను భారత స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఎంపీ వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img