Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మృతి

చత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్‌ జిల్లాలో నక్సల్స్‌కు పోలీసులకు మధ్య ఇవాళ మధ్యాహ్నం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.చోటెడోంగర్‌లోని ఐటీబీపీ శిబిరానికి సమీపంలో ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు. 45వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ జవాన్లు పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఐటీబీపీ అసిస్టెంట్‌ కమాండర్‌ సుధాకర్‌ షిండే, ఏఎస్‌ఐ గురుముఖ్‌ సింగ్‌ మృతి చెందినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందరరాజ్‌ తెలిపారు. నక్సల్స్‌ కోసం భద్రతా దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img