Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ చిత్రా రామకృష్ణకి బెయిల్‌

ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ చిత్రా రామకృష్ణకు ఢల్లీి హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఆమె నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కో-లొకేషన్‌ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ కేసులో రెండో నిందితుడు ఆనంద్‌ సుబ్రమణ్యంకు కూడా బెయిల్‌ లభించింది. సుబ్రమణ్యం గతంలో ఎన్‌ఎస్‌ఈకి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన చిత్రా రామకృష్ణకు ఆయన సలహాదారుగా కూడా ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై 2018లో మొదటిసారిగా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img