Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో శనివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. నాగబరాన్‌ ట్రాల్‌ అడవుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులున్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు.దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img