Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఎమ్‌పీఏటీజీఎమ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం


భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) మరో ముందడుగు వేసింది.ఎమ్‌పీఏటీజీఎమ్‌(మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌) క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. మ్యాన్‌ పోర్టబుల్‌ లాంచర్‌ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి.ఈ మిస్సైల్‌లో అత్యాధునిక ఇన్‌ఫ్రా రెడ్‌ సీకర్‌, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 2.5 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి పరిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img