న్యూదిల్లీ : దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలన్నీ భారత ఎయిర్‌పోర్టు అథారిటీకి భారీ మొత్తంలో బాకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిరచారు. ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలన్నీ కలిసి గతేడాది జనవరి నాటికి రూ.2,306.59కోట్లు బాకీ పడ్డాయని, వాటిని చెల్లించకపోవడంతో ఆ మొత్తం ఈ ఏడాది అక్టోబరు నాటికి 14.29శాతం పెరిగి.. రూ.2,636.34కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో విమానాలకు నేవిగేషన్, ల్యాండిరగ్, పార్కింగ్ కోసం విమాన సంస్థలు పౌరవిమానయానశాఖ పరిధిలో ఉండే ఎయిర్పోర్ట్ అథారిటీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వసూలు చేసిన డబ్బును దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. అయితే, ఎయిర్ ఏషియా ఇండియా తమ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు తాజాగా వెల్లడిరచింది. 2021 అక్టోబరు నాటికి ఈ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీకి రూ.3.58కోట్లు బాకీ పడగా.. ఆ మొత్తాన్ని చెల్లించామని, ఆ తర్వాత క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.