Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌పై విచారణకు సుప్రీం అంగీకారం

న్యూదిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ ద్వారా రాజకీయ పార్టీలకు నిధులను మంజూరు చేసే చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. పిటిషన్‌ వేసిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌… ఈ సమస్య క్లిష్టమైనదని, అత్యవసర విచారణ అవసరమని చేసిన సమర్పించిన నివేదనలను ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘ఈ రోజు ఉదయం కోల్‌కతాకు చెందిన ఒక కంపెనీ ఎక్సైజ్‌ దాడులు జరగకుండా చూసుకోవడానికి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ. 40 కోట్లు చెల్లించినట్లు నివేదించబడిరది. ఇది ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తుంది’ అని భూషణ్‌ అన్నారు. రాజకీయ పార్టీలు 2017-18, 2018-19లో ప్రకటించిన ఎలక్టోరల్‌ బాండ్ల డేటా ప్రకారం ఇప్పటి వరకు జారీ చేసిన మొత్తం ఎలక్టోరల్‌ బాండ్లలో 60 శాతానికి పైగా పాలకపక్షం (బీజేపీ) పొందిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 6,500 కోట్లకు పైగా ఎలక్టోరల్‌ బాండ్లు అమ్ముడుపోయాయని, అందులో అత్యధిక విరాళాలు అధికార పార్టీకి వెళ్లాయని తెలిపింది. గత ఏడాది జనవరి 20న, 2018 ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ను నోటిఫై చేసింది. పథకం యొక్క నిబంధనల ప్రకారం, ఎలక్టోరల్‌ బాండ్‌లను భారతదేశ పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేసిన లేదా స్థాపించబడిన వ్యక్తి కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img