Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

రూ.75,800 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సిసోడియా
న్యూదిల్లీ: దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం అసెంబ్లీలో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. రూ.75,800 కోట్ల అంచనాతో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా శనివారం బడ్జెట్‌ను సమర్పించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడిరచారు. ఎలక్ట్రానిక్‌ సిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఐదేళ్లలో 20 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీనిని రోజ్‌గార్‌ బడ్జెట్‌గా సిసోడియా అభివర్ణించారు. 202223 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.75,800 కోట్ల భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టామని, గతేడాదితో పోలిస్తే ఇది 9.86 శాతం(రూ.69,000 కోట్లు) ఎక్కువని వెల్లడిరచారు. కోవిడ్‌19 ప్రభావం నుంచి క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన రోజ్‌గార్‌ బడ్జెట్‌ దిల్లీ ఆర్థిక వ్యవస్థను మరింత పుంజుకునేలా చేస్తుందని, దిల్లీని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని సిసోడియా చెప్పారు. లక్షలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సిసోడియాను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. దిల్లీకి రోజ్‌గార్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి కూడా అయిన సిసోడియాకు ధన్యవాదాలని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఈ బడ్జెట్‌ పెద్దసంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని నమ్మకంగా చెప్పారు. దిల్లీలోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యరంగానికి రూ.9,669 కోట్లు, విద్యారంగానికి రూ.16,278 కోట్లు ప్రతిపాదించినట్లు సిసోడియా చెప్పారు. మనీశ్‌ సిసోడియా వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకుగాను తమ ప్రభుత్వం రూ.4,500 కోట్లు ఖర్చుపెడుతుందని చెప్పారు. గత బడ్జెట్‌లో ఇందుకోసం కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారు. రోజ్‌గార్‌ బడ్జెట్‌లో భాగంగా నగరంలో రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్ల అభివృద్ధికిగాను కేజ్రీవాల్‌ ప్రభుత్వం షాపింగ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా ఉద్యోగ కల్పన, పర్యాటకులను ఆకర్షించడానికి దోహదపడుందని సిసోడియా వెల్లడిరచారు. ఇందుకుగాను బడ్జెట్‌లో రూ.250 కోట్లు ప్రతిపాదించారు.
సవాల్‌గా మారిన ధరలు, నిరుద్యోగం: కేజ్రీవాల్‌
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ఫ్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. దిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014`15లో వార్షిక బడ్జెట్‌ రూ.31 వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా ఇప్పుడది రూ.76 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. దిల్లీ బడ్జెట్‌ దాదాపు 2.5 రెట్లు పెరిగినట్లు వెల్లడిరచారు. కేజ్రీవాల్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం సామాన్యుడి ముందున్న అతి పెద్ద సవాళ్లని పేర్కొన్నారు. దిల్లీ బడ్జెట్‌ సాహసోపేతమైనదని, వినూత్నమైనదని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దిల్లీలో 1.68 లక్షలమంది ఉపాధికి అర్హులుగా ఉన్నారన్నారు. ఉద్యోగ కల్పనకు టూర్‌, ట్రావెల్‌, కన్‌స్ట్రక్షన్‌ వంటి ఎనిమిది రంగాలను గుర్తించినట్లు వెల్లడిరచారు. దిల్లీ షాపింగ్‌ ఫెస్టివల్‌ పర్యాటకులను ఆకర్షిస్తోందని, ఉచిత నీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. ధరల పెరుగుదల కారణంగా ఉచిత నీరు, ఉచిత విద్యుత్‌, ఆరోగ్యం, రవాణా, విద్య కల్పించడం ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తాయన్నారు. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ పని వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు. ఇల్లు లేని పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img