Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఒకటిన మోదీ పరీక్షా పే చర్చా

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ ఒకటో తేదీన పరీక్షా పే చర్చా కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులతో మోదీ ముఖాముఖి చర్చిస్తారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మోదీ కొన్ని చిట్కాలు చెబుతారు. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం వెల్లడిరచారు. నాలుగేళ్లుగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా 2018 ఫిబ్రవరి 16న తల్కతోరా స్టేడియం నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. నాలుగేళ్లుగా పాఠశాల విద్యాశాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. మొదటి మూడు విడతలు న్యూదిల్లీలోని టౌన్‌హాలు నుంచి నిర్వహించిన మోదీ..నాలుగోసారి గతేడాది ఏప్రిల్‌ 7న ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img