Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

కరోనా వేళ కూలీలను విమానంలో స్వస్థలాలకు పంపిన రైతు ఆత్మహత్య!

2020 కోవిడ్‌ లాక్‌డౌన్‌లో తన వద్ద పనిచేస్తున్న బీహార్‌ కూలీలను విమానంలో.. వారి స్వగ్రామాలకు తరలించి పెద్ద మనస్సు చాటుకున్న పుట్టగొడుగుల రైతు పప్పన్‌ సింగ్‌ గెహ్లాట్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఢల్లీిలోని ఓ ఆలయంలో ఉరివేసుకుని కనిపించారు. ఆయన దగ్గర్నుంచి సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనారోగ్యం కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని పప్పన్‌ ఆ లేఖలో ప్రస్తావించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నారు.ఎప్పుడూ సరదాగా ఉండే గెహ్లట్‌… దేశంలో కరోనా ఉధృతి తగ్గాక తన దగ్గర పని చేసి స్వస్థలాలకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. తిరుగు ప్రయాణానికి కూడా ఆయన వారికి విమాన టికెట్లు కొనుగోలు చేశారు.గెహ్లట్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img