Monday, June 5, 2023
Monday, June 5, 2023

కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురి నియామకం

కర్ణాటకలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుల నియామకం చేపట్టింది. ఏఐసీసీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురిని నియమించింది.

బెంగళూరు పరిశీలకుడిగా రఘువీరారెడ్డి, రాష్ట్రంలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా శైలజానాథ్, బెల్లయ్య నాయక్, సీతక్క, సంపత్ కుమార్, జేడీ శీలం, మల్లు రవిలను నియమించింది. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img