Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

కర్ణాటక మత ఘర్షణల కేసు..167మంది ముస్లింల అరెస్టు

న్యూదిల్లీ: కర్ణాటకలోని కాలబురాగీ జిల్లా అలంద్‌ పట్టణంలోని ఓ దర్గా వద్ద మార్చి 1వ తేదీన హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. మత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ కేసుకు సంబంధించి 17మంది ముస్లింలను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా 1వ తేదీన లాడ్లే మషాక్‌ దర్గా వద్ద గల రాఘవ చైతన్య శివలింగాన్ని శుద్ధి చేస్తామని శ్రీరామ్‌ సేన కార్యకర్తలు అంతకుముందే ప్రకటించారు. గతేడాది నవంబరులో శివలింగానికి అవమానం జరిగిందన్న సాకుతో హిందూ మతోన్మాదులు శుద్ధి కార్యక్రమం ప్రకటించారు. అదేరోజు మృతుల జ్ఞాపకార్థం ఓ మత కార్యక్రమం, ప్రదర్శన నిర్వహించడానికి దర్గా అధికారులు నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3వ తేదీవరకు జిల్లాలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. శ్రీరామ్‌ సేన అధినేత ప్రమోద్‌ ముతాలిక్‌, సేన రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధ లింగస్వామి, కొంతమంది హిందు ఉన్నాదులు జిల్లాలోకి ప్రవేశించారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ హిందూ ఉన్మాదులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఇందులో శ్రీరామ్‌ సేన కార్యకర్తలు సహా బీజేపీ కేంద్రమంత్రి భగవంత్‌ ఖుబా, బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్‌ గుత్తేదార్‌, బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ పాటిల్‌ తెల్కూర్‌, బసవరాజ్‌ మత్తిమదు, బీజేపీరాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికయ్య గుత్తేదారు పాల్గొన్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా హిందూత్వవాదులు ఏమాత్రం లెక్కచేయకుండా వీరంగం సృష్టించారు. చేసేది లేక శివలింగానికి శిద్ధి కార్యక్రమం చేయడానికి 10 మందిని పోలీసులు అనుమతించారు. దీనికి అంగీకరించని మతోన్మాదులు ఆందోళనకు దిగారు. బస్టాండ్‌ వద్ద ధర్నా చేశారు. అదేసమయంలో ముస్లింలు పెద్దఎత్తున దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించడానికి ప్రయత్నించారు. ముస్లింలకు మాత్రమే నిషేధాజ్ఞలు ఎందుకు వర్తింప చేస్తారని వారు ప్రశ్నించారు. సేన కార్యకర్తలకు మాదిరిగానే పది మందికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ యుద్ధవాతావరణం ఏర్పడిరది. రాష్ట్రదాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసుకున్నారు. మూడు వాహనాలు ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో కేవలం ముస్లింల వైపు నుంచే పోలీసులు 167మందిని అరెస్టు చేశారు. శ్రీరామ్‌సేన కార్యకర్తలను విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img