Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

కలిసికట్టుగా సమస్యలపై పోరాడుదాం

: హర్‌సిమ్రత్‌ కౌర్‌
ప్రతిపక్షాలు ఏకమవకపోతే కేంద్రప్రభుత్వం లబ్ధి పొందుతూనే ఉంటుందని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేతృత్వంలో ఓ బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శనివారం కలిసింది. ఈ బృందంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, జమ్మూ-కశ్మీరు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు ప్రతిపక్షాల నుంచి సరైన మద్దతు కనిపించడం లేదని అన్నారు. తాను కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే నేతలతో మాట్లాడానని, కలిసికట్టుగా సమస్యలపై పోరాడుదామని చెప్పానన్నారు. అయితే నేడు తమతో కలిసి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img