Monday, October 3, 2022
Monday, October 3, 2022

కలెక్టర్‌ టీనా దాబి ఫోటోతో వాట్సాప్‌ వసూళ్లు.. వ్యక్తి అరెస్టు

రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన ఓ యువకుడు.. జైసల్మేర్‌ కలెక్టర్‌ టీనా దాబి ఫోటోను వాట్సాప్‌లో వాడి మోసాలకు పాల్పడ్డాడు. ఆ యువకుడిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మొబైల్‌ నెంబర్‌తో వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, దాంట్లో ఐఏఎస్‌ టీనా దాబి ఫోటోను డీపీగా పెట్టాడు. ఇక ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేసి, అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డులు పంపాలంటూ సందేశాలు చేశాడు. అయితే అక్షర దోషం లేని ఇంగ్లీష్‌ భాషలో మెసేజ్‌ చేయడం వల్ల.. చాలా మంది కలెక్టరే గిఫ్ట్‌ కార్డులు అడిగిందే ఏమో అని రెస్పాన్స్‌ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డు పంపాలంటూ మెసేజ్‌ వెళ్లింది. బహుశా టీనా దాబినే ఆ మెసేజ్‌ చేసి ఉంటుందని తొలుత సునితా చౌదరీ భావించింది. కానీ కన్ఫర్మేషన్‌ కోసం టీనా దాబికి ఫోన్‌ చేసిందామె. ఈ విషయాన్ని తెలుసుకున్న జైసల్మేర్‌ కలెక్టర్‌ టీనా దాబి షాకైంది. సదరు విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. ఓ సైబర్‌ బృందం రంగంలోకి దిగి టీనా దాబి ఫోటోతో వసూళ్లకు పాల్పడుతున్న దుంగార్పూర్‌ యువకుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img