Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

కశ్మీర్లో ముగ్గురు చొరబాటుదారులను హతమార్చిన భద్రతా దళాలు

పాకిస్థాన్‌ భూభాగం నుంచి జమ్మూ కశ్మీర్లోకి చొరబడాలన్న ఉగ్రవాదుల పన్నాగాన్ని భారత భద్రతా బలగాలు వమ్ముచేశాయి. యూరీ సెక్టార్లోని కమాల్‌ కోటే వద్ద ముగ్గురు చొరబాటుదారులను జవాన్‌లు కాల్చి చంపారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కి సమీపంలో మదియాన్‌ నానక్‌ పోస్టు వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భారత సైన్యం, కశ్మీర్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. భారత బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులు మరణించడంతో చొరబాటు యత్నం భగ్నమైంది. దీనికి సంబంధించిన వివరాలను కశ్మీర్‌ పోలీసులు వెల్లడిరచారు. ఇటీవల కాలంలో కశ్మీర్‌ సరిహద్దుల వ్యాప్తంగా చొరబాట్లు పెరిగాయి. 2018 నుంచి 2021 వరకు 366 చొరబాటు యత్నాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో పార్లమెంటుకు తెలిపింది. 2004లో కేంద్రం 740 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఓసీ వద్ద 550 కిలోమీటర్ల మేర కంచెను నిర్మించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img