London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

కాంగ్రెస్ ను కనీసం 150 స్థానాల్లో గెలిపించండి : రాహుల్ గాంధీ

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని హామీ

అవినీతి బీజేపీ పాలనకు చరమగీతం పలికేందుకు కర్ణాటక ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని రాహుల్ గాంధీ కోరారు. వచ్చే నెల 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారపర్వంలో బిజీగా ఉన్నారు. ఈశాన్య కర్ణాటకలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ… భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ, ఆరెస్సెస్ లు దాడి చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటకలో కనీసం 150 స్థానాల్లో గెలిపించడం ద్వారా పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు. బీజేపీకి 40 సీట్లు ఇస్తే చాలని… అంతకంటే ఎక్కువ అవసరం లేదని అన్నారు. 40 శాతం కమీషన్లు తీసుకునే బీజేపీని 40 సీట్లకే పరిమితం చేయాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఓబీసీ డేటాను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామని చెప్పారు. ఆదివాసీలకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని ఆరు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. ఓబీసీలకు న్యాయం చేయలేని ప్రధాని మోదీ వెళ్లిపోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img