Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

కాంతారకు ఎదురుదెబ్బ

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సాధించిన కాంతార మూవీకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతికి మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రమే కాంతార.భూతకోల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే వరాహరూపం పాటను ఇకపై ప్రదర్శించడకూడదని కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ వారు రూపొందించిన నవరసం అనే ఆల్బమ్‌కు కాపీగా వరాహరూపం తీర్చిదిద్దారని పేర్కొంటూ ఈ తీర్పును వెలువరించింది.థాయికుడమ్‌ బ్రిడ్జీ అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్‌ ఇతర మ్యూజిక్స్‌ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీన్ని తెలియ జేస్తూ థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. గతంలో కూడా ఇన్‌స్టా వేదికగా థాయికుడమ్‌ బ్రిడ్జీ పోస్ట్‌ పెట్టారు. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img