Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కార్పొరేట్‌ వ్యవస్థలకు వ్యతిరేకం కాదు..కానీ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తాం : రాహుల్‌గాంధీ

రాజస్థాన్‌లో సుమారు 60వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నట్లు వ్యాపారవేత్త అదానీ ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత్‌ జోడో యాత్రలో భాగంగా కర్నాటకలో రోడ్‌ షో చేస్తున్న రాహుల్‌ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారవేత్త అదానీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించలేదన్నారు.తాము కార్పొరేట్‌ వ్యవస్థలకు వ్యతిరేకం కాదు అని, కానీ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు.ఒకవేళ తప్పుడు పద్ధతిలో రాజస్థాన్‌ ప్రభుత్వం అదానీకి వ్యాపారం అప్పగిస్తే, దాన్ని తాను వ్యతిరేకించనున్నట్లు వెల్లడిరచారు. వ్యాపారవేత్త 60 వేల కోట్లు పెట్టుబడి పెడుతానంటే ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని తిరస్కరించరని రాహుల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img